కాంచన మనసు మార్చిన పాట - MicTv.in - Telugu News
mictv telugu

కాంచన మనసు మార్చిన పాట

October 30, 2017


అందచందాలతో అలరించిన అలనాటి నటి కాంచన.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారన్నది ఇప్పటికీ చాలామందికి అంతుబట్టని విషయం. జీవితంలో ఆటుపోట్లు, ఆమె ఆస్తి కోసం కుటుంబ సభ్యుల వేధింపులు ఆమెకు ఆస్తిపాస్తులపై, జీవితంపై విరక్తి కలిగించాయి. ముఖ్యంగా ఓ పాట తన జీవితాన్నే మార్చేసిందని ఆమె తాజాగా చెప్పారు. సోమవారం మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగం, శ్రీఫౌండేషన్ నిర్వహించిన సినారె సంస్మరణ సభలో ఆమె ప్రసంగించారు. ‘భక్త తుకారం’ సినిమాలో సినారె రాసిన ‘పూజకు వేళాయరా’  పాట తన జీవితాన్ని మొత్తం మార్చేసిందని చెప్పారు. ‘మనిషి అందం అశాశ్వతమని ఆ పాటలో ఉంది.  ఈ పాట అర్థం తెలుసా అని అక్కినేని నాగేశ్వరరావు నన్ను అడిగారు.. తర్వాత చాలా ఆలోచించాను.. జీవిత సత్యాన్ని కళ్లకుకట్టిన ఆ పాట వల్ల నా మనసు ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లింది’ ఆని ఆమె చెప్పారు.