తెలంగాణ మరో అల్లర్ల కశ్మీర్ అవుతుందన్న జయేంద్ర - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ మరో అల్లర్ల కశ్మీర్ అవుతుందన్న జయేంద్ర

February 28, 2018

అనారోగ్యంతో కన్నుమూసిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర స్వామి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఆధ్యాత్మికంగా గొప్పవారే కావొచ్చు కానీ రాజకీయాల్లో అనవసరంగా తలదూర్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులు చెప్పేవారు.‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే అది కశ్మీర్‌లా మారుతుంది. అల్లర్లతో అట్టుడికిపోతుంది. విభజనతో తెలంగాణలో అన్యమతస్తులు తిష్టవేస్తారు. దీంతో అల్లర్లు, మత ఘర్షణలు చెలరేగుతాయి. అందుకే తెలుగు ప్రజలు విద్వేషాలు మానుకుని కలసి ఉండాలి..’ అని జయేంద్ర చెప్పారు. రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రం సాకుతో విద్యార్థులను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఆధ్యాత్మిక బోధనలు చేసుకోండని, అవగాహన లేకుండా ఇలా మాట్లాడొద్దని హితవు పలికింది.