భారత విమానం హైజాకర్ హత్య - MicTv.in - Telugu News
mictv telugu

భారత విమానం హైజాకర్ హత్య

March 7, 2022

last

భారత విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించిన ఉగ్రవాది జహూర్ మిస్త్రీ ఈ నెల 1న పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. వివరాలు.. 1999 డిసెంబర్ 24 వ తేదీన నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి లక్నో బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్నిఉగ్రవాదులు దారి మళ్లించారు. మొదట పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ల్యాండవగా, అక్కడ ఇంధనాన్ని నింపుకొని విమానాన్ని దుబాయ్ ఎయిర్ పోర్టుకి తరలించారు. అక్కడి నుంచి కాందహార్‌కు తరలించారు. అప్పుడు విమానంలోని ప్రయాణీకులను అడ్డం పెట్టుకొని భారతదేశంలోని జైళ్లలో ఉన్న ఉగ్రవాద టాప్ కమాండర్లను విడిపించుకున్నారు. నాటి ఘటనలో పాల్గొన్న జహూర్ మిస్త్రీ తర్వాత పేరు మార్చుకొని ప్రస్తుతం కరాచీలో ఫర్నీచర్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మిస్త్రీపై కాల్పులు జరిపారు. ఈ దృష్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అంత్యక్రియలను కరాచీలోనే నిర్వహించగా.. ఉగ్రవాద సంస్థ జైషే నుంచి అగ్రనేతలు హాజరయ్యారు. కాగా, జహూర్ హత్యను ధృవీకరించిన జియో టీవీ, మొదట ఓ వ్యాపార వేత్త హత్య అంటూ ప్రసారం చేసింది.