వాడు పూరీజగన్నాథుడు...! - కందికొండ ( ఫిల్మ్ లిరిసిస్ట్ ) - MicTv.in - Telugu News
mictv telugu

వాడు పూరీజగన్నాథుడు…! – కందికొండ ( ఫిల్మ్ లిరిసిస్ట్ )

July 23, 2017

అబ్బర పులి అంటే తోక బారెడు అనుకుంట
బాయిలబడ్డోని మీద బండెడు రాళ్ళేసె
లోకుల నైజం జూసి…
షాబాద్ బండల మీద తనకు శానా ఇష్టమైన
బొచ్చుకుక్కలతోని ఆడుకుంట
‘ పెడిగ్రీ ’ తినిపిచ్చుకుంట
మనుషుల కన్నా కుక్కలే నయం అని
ఓషో లెక్క నిర్మలంగ నవ్వుతాండు
వాడు పూరీజగన్నాథుడు…!

డ్రగ్స్ ఇస్తాండని ఒకడు
డ్రగ్స్ దందా చేస్తాండని ఇంకొకడు
నరంలేని నాలుకలతోని
పచ్చి బ్రోకర్ కూతలు కూసె
పగటి వేషగాండ్ల కథలు ఇనుకుంట
‘‘ ఐ లవ్ ఇండియా – ఐ హేట్ ఇండియన్స్ ’’ అని
వాని జిన్నుప్యాంటు జిప్పుఇప్పి
గోబెల్ ప్రచారగాండ్ల నోర్లల్ల
గరం గరం ఉచ్చ బోస్తాండు
వాడు పూరీజగన్నాథుడు…!

వందలకోట్ల ఆస్తులు దోచి
నమ్మిన జిగ్రీ దోస్తుగాండ్లె నట్టేట ముంచితే
‘‘ నథింగ్ ఈజ్ పర్మినెంట్ ’’
‘‘ లైఫ్ డజ్ నాట్ లిజన్ టు యువర్ లాజిక్
ఇట్స్ గో ఆన్ ఇట్స్ ఓన్ వే
యూ లిజన్ లైఫ్ లాజిక్
ఇట్స్ డోన్ట్ బాదర్ అబౌట్
యువర్ లాజిక్ ’’
అని ఓ చిన్న చిరునవ్వు నవ్వి
జిందగీని మొదటి మెట్టు నుండి
సురువుజేసినోడు !
పైసల కోసం డ్రగ్స్ పంపిస్తడని నిందలేస్తాంటె
ఇంటి ముందు పచ్చపచ్చని గడ్డిల
రంగు రంగుల పక్షులతోని
ముచ్చట్లు బెట్టుకుంట
పరాశ్కాలాడుకుంట
‘ చెగువేర ’ లెక్క
గోల్డ్ ఫ్లాక్ లైట్ సిగరెట్టెలిగిచ్చి
నల్లటి మబ్బులకు తెల్లటి పొగలరంగేస్తాండు
కట్టు కథలోల్ల మీద కాండ్రకిచ్చి ఉమ్మేస్తాండు
వాడు పూరీ జగన్నాథుడు…!

పనీపాటలేని బాడకావ్ లంత పనిగబెట్టుకోని
కోడిగుడ్డు మీద ఈకలు పీక్కుంట
కోతికి ఆ…లు పుట్టిచ్చుకుంట
సండ్లల్ల బొక్కలేరుకుంట
మీడియాలల్ల సొల్లు ముచ్చట్లు రాత్తాంటె
‘‘ సిట్ ’’ కు లేని ఆత్రం మీకెందుకురా
‘‘ షిట్ ’’ నా కొడుకుల్లారా…
అని సిర్రెత్తి…
వాని గుబురు గడ్డంలకెల్లి
ఒక్కొక్క తెల్ల వెంట్రుక పీకి
గాలిలకు ఉఫ్ అని ఊదుతాండు
వాడు పూరీజగన్నాథుడు…!

 

– కందికొండ ( ఫిల్మ్ లిరిసిస్ట్ )
MA telugu ( ph.d )
MA politics. OU