తెలుగు మహాసభలకు కందికొండ కానుక - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు మహాసభలకు కందికొండ కానుక

December 9, 2017

ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ కందికొండ తెలంగాణ సాంస్కృతిక వైభవ గీతాన్ని రచించిండు. ఈ పాటలో తెలంగాణ కవులైన పాల్కురికి, పోతన, వానమామలై వరదాచార్యులు, ప్రజల మనిషి వట్టికోట అళ్వారుస్వామి, సినారె, సిద్ధప్ప, కాళోజి, దాశరథి లాంటి మహానుభావుల యాదికి తెచ్చిండు. తెలంగాణ భాష యాస రుచిని ఆవిష్కరించిండు.  

తంగెడు పువ్వుల బంగారు వర్ణాలను జమ్మి చెట్టు పచ్చ పచ్చని వెలుగులను పాట అంతటా పరిచిండు, జానపదుల శ్వాసగా తెలంగాణ భాషను అభివర్ణిస్తూ మట్టి పరిమళాన్ని తన పాటతో ప్రపంచ వ్యాప్తంగా వెద జల్లుతాoడు, బతుకమ్మ పండుగల సంబురాన్ని బోనాల కోలాహాలన్ని కొమ్ము కోయ గోండుల గుస్సాడీ ఆటలను లాంబాడీల తీజ్ లను తన అక్షరాలతో మోసుకొస్తాoడు.

అవ్వ పాల దారతో అల్లుకున్న భాషలో మట్టి వాసన ఉంటదని కొత్త కొత్త ముచ్చట్లు చెప్పుతాండు 31జిల్లాల ముద్దు ముద్దు మాటలను తేనెలో ముంచి గుండె మీద చిలకరిస్తాoడు ముల్కి పోరు గాణమై సకలజన నినాదమై తెలంగాణ భాష ఎట్లెట్ల ముందుకురికిందో  ఎట్లెట్ల కొట్లాడిందో వివరిస్తాoడు అనేక అనేక అవమానాల అనుభవించిన తెలంగాణ భాష

చివరకు ఒక సాహిత్య అకాడమీ గా ఎదిగిన చారిత్రక నేపద్యాన్ని పూసగుకచ్చినట్టు ఈ పాటల చెప్పుకచ్చిండు. ఈ పాట నిండా పల్లెల పచ్చదనాలు శ్రమ జీవుల చెమట చుక్కలు జానపదుల అమాయకత్వం తొలకరి చినుకుల చల్లదనo ఉన్నాయి స్వచ్ఛమైన గుండెలతో  ఆస్వాదిద్దాం పదండి తెలంగాణ సాంస్కృతిక వైభవ  గీతంలోకి….