కంగనా కొత్త చిత్రం ‘ఎమర్జెన్సీ’.. ఇందిరాకు వ్యతిరేకంగానే అంటున్న రనౌత్ - MicTv.in - Telugu News
mictv telugu

కంగనా కొత్త చిత్రం ‘ఎమర్జెన్సీ’.. ఇందిరాకు వ్యతిరేకంగానే అంటున్న రనౌత్

July 4, 2022

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఆమె నటించిన గత రెండు చిత్రాలు పరాజయం కావడంతో ఈ సారి చేయబోయే సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజా చిత్రానికి ‘ఎమర్జెన్సీ’ అనే టైటిల్ పెట్టినట్టు కంగనా వెల్లడించింది. 1977లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించే సినిమా ఉంటుందనీ, అందులో తాను ఆమె పాత్రనే పోషిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిల్మ్స్ బ్యానర్లోనే ఈ చిత్రం నిర్మిస్తున్నానని సినిమా వివరాలను అభిమానులతో పంచుకొంది. పొలిటికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు, రాజకీయ కుట్రలు, దేశం ఎదుర్కొన్న సంక్షోభం వంటివి చూపించబోతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి అభిమానుల ఆశీస్సులు కావాలంటూ కంగనా అభ్యర్ధించింది.