Home > కంగనాకు కత్తి గాయాలు !

కంగనాకు కత్తి గాయాలు !

క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘ మణికర్ణిక ’ సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమాలో ప్రధాన భూమిక పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నుదురు మీద కత్తి గాయమై సుమారు పదిహేను కుట్ల వరకు పడ్డాయని నిర్మాత కమల్ జైన్ తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా శరవేగంగా షూట్ జరుపుకుంటోంది. ఝాన్సీ లక్ష్మీబాయి బయోగ్రఫీగా అత్యంత భారీ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా టైటిల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కత్తి యుద్ధం నేపథ్యంలో ప్రాక్టీస్ కూడా చేసిందట.

అయితే షూటింగ్ సమయంలో డూప్ ని పెట్టాలని డైరెక్టర్ భావించినప్పటికీ కంగనా ఒప్పుకోక రిస్క్ తీసకుందట. సహ నటుడు నిహార్, తను కత్తి యుద్ధం చేస్తుండగా అకస్మాత్తుగా కత్తి వచ్చి తన నుదురును కోసుకుందట. వెంటనే హాస్పిటల్ తరలించారట కూడా. గాయం పూర్తిగా కోలుకునేవరకు తను షూటింగ్ లో అస్సలు పాల్గొనకూడదని డాక్టర్లు హెచ్చారించారట. క్వీన్ తర్వాత కంగనా తనకు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా మణికర్ణికను భావిస్తోందట.

Updated : 20 July 2017 4:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top