కోహ్లీతో నాకు పోలికలున్నాయి..నటి కంగన - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీతో నాకు పోలికలున్నాయి..నటి కంగన

January 25, 2020

Kangana Ranaut

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి, తనకి రెండు విషయాల్లో పోలిక ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ వెల్లడించారు. ఆమె నటించిన ‘పంగా’ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె విరాట్‌ గురించి మాట్లాడారు. 

‘నాకు, కోహ్లీకి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని ఎంతో మంచి చెబుతుంటారు. ఎంతో మంది క్రికెట్‌ అభిమానులు కోహ్లీని ప్రేమిస్తారు. మా ఇద్దరి మధ్య ఒక పోలిక ఉంది. మేము ఇద్దరం ఎక్కువ వివాదాలు ఎదుర్కొన్నాం. దీంతో ఎక్కువ అభిమానులను సంపాదించాం. అంతేకాకుండా కోహ్లీకి దూకుడు ఎక్కువ అని విమర్శిస్తుంటారు. నేను కూడా ఎంతో దూకుడుగా ఉంటాను. క్రీడాకారుడి జీవితం అంత సులువు కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆట కోసం వారు తీవ్రంగా సాధన చేస్తారు. ఫిట్‌నెస్‌ కోసం ఎంతో శ్రమిస్తారు’ అని కంగనా తెలిపారు. జనవరి 24న విడుదలైన పంగా చిత్రం మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో కంగనా జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నటించింది. అశ్వినీ అయ్యర్‌ తివారి దర్శకత్వం వహించారు.