'రోడ్డుపై రేప్ చేస్తా'.. నటి కంగనకు బెదిరింపులు! - MicTv.in - Telugu News
mictv telugu

‘రోడ్డుపై రేప్ చేస్తా’.. నటి కంగనకు బెదిరింపులు!

October 21, 2020

ఇటీవల సోషల్ మీడియాలో రేప్ బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల క్రికెటర్ ధోని, తమిళ నటుడు విజయ్ సేతుపతిల కుమార్తెలను చేస్తామని సోషల్ మీడియాలో కొందరు బెదిరింపులకు దిగారు. తాజాగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల కింద ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది రేప్ బెదిరింపులతో కూడిన కామెంట్స్‌ చేశాడు. 

‘నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా’ అంటూ సదరు లాయర్ కంగన ఫోటోల కింద కామెంట్లు చేశాడు. వీటిని నెటిజన్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సదరు లాయర్ స్పందిస్తూ.. తన ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్‌కు గురయ్యిందని తెలిపాడు. ‘నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేసి దాని నుంచి అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. నా స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని షాక్‌కి గురయ్యాను. నాకు స్త్రీలు, సమాజం పట్ల గౌరవం ఉంది. నా అకౌంట్‌ నుంచి వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి’ అని పోస్ట్‌ పెట్టాడు. అలా పోస్ట్‌ పెట్టిన కొద్ద సమయానికే ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డిలీట్‌ చేశారు.