న్యూడ్‌గా నటించడానికి సిద్ధమైన కంగనా! - MicTv.in - Telugu News
mictv telugu

న్యూడ్‌గా నటించడానికి సిద్ధమైన కంగనా!

October 22, 2019

Kangana ,

బాలీవుడ్ వివాదల క్వీన్ కంగనా రనౌత్ ఒంటిమీద నూలుపోగు లేకుండా నటించడానికి సిద్ధం అవుతోంది. తన మార్క్ నటనతో ఆకట్టుకునే కంగనా న్యూడ్‌గా నటించడానికి కారణం ఆ సినిమా కథ తనకు నచ్చడమేనట. అమలా పాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్  దర్శకత్వంలో వచ్చిన ఆడై (తెలుగులో ‘ఆమె’)గా వచ్చిన విషయం తెలసిందే. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది . అయితే ఆ చిత్రంలో అమలా పాల్ న్యూడ్‌గా నటించిన విషయం తెలిసిందే. అసభ్యతకు తావులేకుండా అమలా ఆ పాత్రను చక్కగా పోషించి మెప్పించింది. 

అయితే ఈ చిత్రాన్ని హిందీలో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు దర్శకుడు రత్నకుమార్ తన పేస్‌బుక్ పేజీలో వెల్లడించాడు. అమలా పాల్ పోషించిన పాత్రను హిందీలో ఒక ప్రముఖ హీరోయిన్ పోషించనుందని చెప్పాడు. ఆడై చిత్ర అనువాద హక్కులను పొందిన దర్శక, నిర్మాత విక్రమ్ భట్ ఈ కథను కంగనా రనౌత్‌కు వినిపించినట్లు తెలుస్తోంది . కంగనా రనౌత్ కథ విని కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం. అమలా పాల్ తరహాలో న్యూడ్‌గా నటించేందుకు కంగనా ఒకే చెప్పిందన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తోంది.