బాలీవుడ్‌పై కంగన మరో బాంబ్.. ఈసారి ఏకంగా పేరుపైనే - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌పై కంగన మరో బాంబ్.. ఈసారి ఏకంగా పేరుపైనే

October 16, 2020

Kangana Ranaut on Bollywood  .j

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రతిసారి ఏదో ఒక విషయంపై సంచలనం  రేపుతూనే ఉంది. అక్కడ ఉన్న నెపోటిజం,డ్రగ్స్ సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంత మంది నటులను కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పదునైన విమర్శలు చేసింది. ఓ దశలో మహారాష్ట్ర సర్కార్‌తోనే పోరాటం చేసింది. ఈ క్రమంలో తాజాగా మరో బాంబ్ వేసింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ అనే పేరునే వివాదంలోకి లాగింది. 

బాలీవుడ్ అనే పేరు కాపీ కొట్టారని అభిప్రాయపడింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ పేరును తీసుకున్నారని విమర్శించింది. ‘తలైవి’ చిత్రం షూటింగ్‌లో ఉన్న ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన కామెంట్ చేసింది. ‘మన దేశంలో కళాకారులున్నారు, బఫూన్లు కూడా ఉన్నారు. భారత చిత్ర పరిశ్రమ ఉంది. బాలీవుడ్ కూడా ఉంది. బాలీవుడ్ అనే హాస్యాస్పదమైన పదాన్ని హాలీవుడ్ నుంచి కాపీ చేసి దొంగలించారు. ఈ పదాన్ని దయచేసి తిరస్కరించండి’ అని ట్వీట్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.  కంగన నేరుగా చిత్ర పరిశ్రమే టార్గెట్ చేయడంపై హాట్ టాపిక్‌గా మారింది.