మరి ‘మహాభారతం’ సంగతేంటి..?..సైఫ్‌కు కంగన సవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

మరి ‘మహాభారతం’ సంగతేంటి..?..సైఫ్‌కు కంగన సవాల్

January 22, 2020

hnmjh

గత కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై నటి కంగనా రనౌత్ స్పందించారు. ఇటీవల సైఫ్ కీలకపాత్రలో నటించిన ‘తానాజీ’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సైఫ్ అలీఖాన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తానాజీ సినిమా చరిత్రకు సంబంధించిందని భావించిడం లేదు. అలాగే బ్రిటిషర్లు రాకముందుకు వరకూ భారత్ అనే కాన్సెప్ట్ ఉందని అనుకోవడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా కంగన ఓ వార్తాసంస్థ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె సైఫ్ వ్యాఖ్యలను ఖండించారు. సైఫ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. బ్రిటిషర్లు మనదేశంలోకి అడుగు పెట్టకముందే ఐక్య భారతదేశం ఉందని మహాభారతం తెలియజేస్తోంది. బ్రిటిషర్లు రాకముందు భారతదేశం అనేది లేనప్పుడు మహాభారతం ఏమిటి? 5000 సంవత్సరాల క్రితం రచించిన ఆ మహాకావ్యం ఏం చెబుతోంది? వేద వ్యాసుడు రాసింది ఏమిటి? అని కంగనా తెలిపారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.