'అమ్మ' కోసం హార్మోన్లు తీసుకున్నా..కంగన - MicTv.in - Telugu News
mictv telugu

‘అమ్మ’ కోసం హార్మోన్లు తీసుకున్నా..కంగన

November 25, 2019

Kangana Ranaut Reveals She Took 'Dose of Hormone Pills' to Gain Weight for Jayalalithaa role Biopic

బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు. ఆమె కెరీర్‌‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. రొమాంటిక్ సినిమాల్లో నటించారు.. చారిత్రక చిత్రాల్లో ఖడ్గం పట్టారు. నటిగా, దర్శకురాలిగా సత్తా చాటారు. తాజాగా నిర్మాతగా కూడా మారబోతున్నారు. ప్రస్తుతం ఆమె ‘తలైవి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళులు అమ్మ అని పిలుచుకునే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్. జయలలిత శరీరం లావు ఉంటుందన్న సంగతి తెల్సిందే. 

దీంతో ఆమె పాత్రలో నటిస్తున్న కంగనా ఉన్నపలంగా లావు పెరగాల్సి వచ్చింది. అందుకోసం ఆమె తగిన మోతాదుల్లో హార్మోన్ పిల్స్ తీసుకున్నట్లు ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, ఇటీవల తలైవిగా కంగనా టీజర్ విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అరవింద్ సామీ మరో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తుండగా విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, హిందీ పాత్రల్లో విడుదల కానుంది.