కంగన ఇంటివద్ద కాల్పులు.. బెదిరిస్తున్నారన్న నటి - MicTv.in - Telugu News
mictv telugu

కంగన ఇంటివద్ద కాల్పులు.. బెదిరిస్తున్నారన్న నటి

August 1, 2020

Kangana Ranaut says she heard gunshots near Manali home

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సాగుతున్న మాటల యుద్ధం, కేసుల తతంగం చివరికి కాల్పుల వరకూ వచ్చింది. సుశాంత్ సినీపరిశ్రమలోని బంధుప్రీతికే బలయ్యాడని, మహారాష్ర్ర్ట సీఎం కొడుకు, మంత్రి అదిత్య ఠాక్రే పాత్రేదో ఉందని చెబుతున్న నటి కంగన రౌత్ ఇంటి వద్ద నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు మనాలీలో కంగన ఇంటి వద్ద గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు హుటాహుటిన అక్కడి చేరుకుని గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తనన నోరు మూయించడానికి కాల్పులకు పాల్పడ్డారని కంగన మండిపడుతోంది. 

‘ఏవో శబ్దాలు అనుకున్నాను. కానీ రెండోసారి కూడా కాల్పులు జరిగాయి. ఎవరో నన్ను బెదిరించడానికే ఇలా చేస్తున్నారు.. పోలీసులకు ఫోన్ చేశాను.. నా గదికి ఎదురుగానే ఉన్న గోడకు ఆవలివైపు నుంచ కాల్పులు జరిపారు. అక్కడంతా అడవి ఉంది. సుశాంత్‌ను ఇలాగే భయపెట్టి ఉంటారు ’ అని కంగన చెప్పింది.