బాలీవుడ్ వివాదాస్పద బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా నటించిన థాకడ్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజాయాన్ని చవి చూసింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా కేవలం రూ. 5 కోట్ల వసూళ్లే సాధించింది. దీంతో బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్టులోని వెళ్లింది. యాక్షన్ హీరోయిన్గా కంగనా సత్తా చాటుతుందనుకున్న అంచనాలన్నీ తారుమారైపోయాయి. విడుదలైన మొదటిరోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోగా ఎనిమిదో రోజు (మే 27)న కేవలం 20 టిక్కెట్లే అమ్ముడుపోయి, రూ. 4420 మాత్రమే వసూలు చేసింది.
దీంతో ఈ సినిమాను ఓటీటీలకు అమ్మేసి నష్టాలను కొంతైనా తగ్గించుకుందామని భావించిన నిర్మాతకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. సినిమా రిలీజుకు ముందు భారీ ఆఫర్ ఇచ్చినా నిర్మాతలు వాటిని తిరస్కరించారు. ఇప్పుడు డిజాస్టర్ అవడంతో ఓటీటీలు కనీస ధరకు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. కాగా, కాంట్రవర్సీలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కంగనా రనౌత్కి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యమే.