Kangana Ranaut will contest from Mandi in next Lok Sabha elections if given ticket by BJP
mictv telugu

బీజేపీ టిక్కెట్ ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తా.. కంగనా

October 29, 2022

Kangana Ranaut will contest from Mandi in next Lok Sabha elections if given ticket by BJP

సినిమాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన నటి కం హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు కోరుకొని, బీజేపీ అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఆమె అక్కడ ఓ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మనసులో మాట చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీకి ప్రత్యర్ధి రాహుల్ గాంధీ కావడం దురదృష్టకరమని తెలిపారు. మోదీ మహా పురుష్ అని, ఆయనకు ఎదురులేదన్న విషయం తనకు తెలుసని వెల్లడించారు. అటు కేజ్రీవాల్ ఉచిత పథకాల పట్ల విమర్శలు గుప్పించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు సోలార్ పవర్ ఆధారంగా పంటలు పండిస్తారని, కేజ్రీ ఇచ్చే ఉచిత కరెంటు పథకాలు ఇక్కడ చెల్లవంటూ ఘాటూగా స్పందించింది.