యంగ్ జయలలితగా కంగనా రనౌత్ - MicTv.in - Telugu News
mictv telugu

యంగ్ జయలలితగా కంగనా రనౌత్

February 24, 2020

nfbgngxj..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. 

ఎమ్‌జీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నాడు. ఈ సినిమాలో కంగన పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన రెండు లుక్కులకు మంచి స్పందన వచ్చింది. తాజాగా జయలలిత 72వ జయంతి సందర్భంగా చిత్రబృందం మరో లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.