వీరనారి తర్వాత..  వృద్ధనారిగా కoగన - MicTv.in - Telugu News
mictv telugu

వీరనారి తర్వాత..  వృద్ధనారిగా కoగన

December 4, 2017

కoగనా రనౌత్..  ఝాన్సీ రాణిగా మణికర్ణిక చిత్రం నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిoదే. చారిత్రాక నేపథ్యం ఉన్న ఈ సినిమా కోసం ఆమె  చాలా కష్టపడి పని చేస్తోంది. ఇటీవల పోరాట సన్నివేశాలు చిత్రిస్తున్నప్పుడు ఆమె గాయపడిన సంగతి తెలిసిందే.

ఐతే ఈ చిత్రం తర్వాత తను సొంత చిత్రాల్లోనే నటిస్తానని ఆమె చెప్పింది.  వేరే ఏ దర్శకుడితో కాకుండా సొంత దర్శకత్వంలోనే ‘ ‘తేజు’ చిత్రంలో నటిస్తానని,  అందులో 80 ఏళ్ళ వృద్దురాలి పాత్ర చేస్తానని తెలిపింది. అయితే తర్వాత ఆమె మనసు మార్చుకుంది.

శేఖర్ కపూర్ తీస్తున్న ఓ సినిమాలోనూ ముదుసలి పాత్ర పోషించడానికి అంగీకరించింది. అంటే ఎనిమిది పదుల వయసు పాత్రలతో ఎంతలేదన్నా రెండు సినిమాల్లో మనకు కంగన వృద్ద నారిగా తన లోని నటనా పాటవాన్ని ప్రదర్శించనున్నదన్నమాట.