‘
సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యల వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు మహేశ్ అన్న దాంట్లో నిజముందని చెప్పగా, ఆర్జీవీ లాంటి దర్శకుడు మహేశ్ మాటలు తనకర్ధం కాలేదని ట్వీట్ చేశాడు. బోనీ కపూర్ అయితే ఈ అంశంపై మాట్లాడే అర్హత తనకు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్ స్పందించారు. తన తాజా చిత్రం ‘థాకడ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతుండగా, ఆమెకు ఈ ప్రశ్న ఎదురైంది.
మీ కామెంట్ ఏంటని అడుగగా.. ‘మహేశ్ అన్న దాంట్లో తప్పేముంది. ఆమన నిజమే మాట్లాడారు. నిజంగా బాలీవుడ్ మహేశ్‌ని తట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా కోసం బాలీవుడ్ వాళ్లు ఎవరెవరు ఆయనను సంప్రదించారో నాకు తెలుసు. ఇప్పుడు తెలుగు పరిశ్రమ నెం 1 స్థానంలో ఉంది. కాబట్టి మహేశ్ అడిగినంత రెమ్యునరేషన్ బాలీవుడ్ ఖచ్చితంగా ఇవ్వలేదు. తన పని, టాలీవుడ్‌పై నిబద్ధత చూపడం వల్లే మహేశ్ ఈ స్థాయికి రాగలిగాడు. దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. గత దశాబ్దం నుంచి తెలుగు పరిశ్రమ దేశంలోని మిగతా చిత్ర పరిశ్రమలన్నింటినీ దాటుకొని ముందుకెళ్లింది. ఆ పరిశ్రమ నుంచి మనం చాలా నేర్చుకోవాలి’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చింది.