Kanhayalal's two sons were given jobs by the government
mictv telugu

ఉదయ్‌పూర్ హత్య.. ఇద్దరు కుమారులకు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం

July 7, 2022

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. నిందితులు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. కన్హయ్యలాల్ ఇద్దరు కుమారులు యష్ తేలి, తరుణ్ తేలిలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆరాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనికోసం నిబంధనల్లో మార్పులు చేశారు. రాజస్థాన్ సబార్డినేట్ ఆఫీస్ క్లర్క్ సర్వీస్ రూల్స్ 2008, 2009లోని రూల్ 6సి ప్రకారం వారి నియామకం చేస్తున్నట్టు తెలిపారు. కన్హయ్యలాల్ సంపాదన పైనే కుటుంబం ఆధారపడి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.