ఎట్టకేలకు కనికాకు కరోనా నెగెటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎట్టకేలకు కనికాకు కరోనా నెగెటివ్

April 4, 2020

Kanika Kapoor tests negative for Covid-19, will be kept under observation until she tests negative again

ఎట్టకేలకు కరోనా బారినుంచి బాలీవుడ్ గాయ‌ని క‌నికా క‌పూర్‌ తప్పించుకుంది. పరీక్షలు చేయించుకున్న ప్రతిసారి ఆమెకు కరోనా పాజిటివ్ అనే తేలింది. ఐదోసారి ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఆమెకు ఊరట లభించినట్టైంది.  కనికాకు కరోనా నెగెటివ్ వచ్చిందని ‘ఏఎన్‌ఐ’ శనివారం వెల్లడించింది. కరోనా లేదని పరీక్షల్లో తేలినప్పటికీ ఆమెను వెంటనే డిశ్చార్జి చేసే అవకాశం లేదని తెలిపింది. ఆమెకు నిర్వహించే మరో పరీక్షలోనూ నెగెటివ్‌ వస్తేనే.. అప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పారు. ప్రస్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంజ‌య్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతోంది. 

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వ్యైదులు వివరించారు. కాగా, విదేశాల‌ నుంచి వ‌చ్చిన కనికా ప‌లు వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు ఆమె ఇచ్చిన విందుకు హాజ‌ర‌వ‌గా తీవ్ర క‌ల‌క‌లం రేగింది. క‌నికాకు క‌రోనా సోకింద‌ని నిర్ధార‌ణ కాగానే ఆమెకు స‌న్నిహితంగా మెలిగిన వారంద‌రూ క్వా‌‌రంటైన్‌‌‌కు వెళ్లారు. ‌ఈ క్రమంలో ఆమెపై ఉత్తర్ ప్రదేశ్‌లో కేసు కూడా నమోదు అయింది.