చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత భౌతిక దూరం పాటిస్తూ భక్తులు దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడి దృష్యా మరో గంట పాటు అదనంగా దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు ఆలయం ఈవో వెంకటేశ్ వెల్లడించారు.
ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శన వేళలు ఉంటాయని చెప్పారు. ఇప్పటి వరకు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. కానీ భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఒత్తిడి గందరగోళం లేకుండా జాగ్రత్తగా భక్తులు ఆలయానికి రావాలని సూచించారు. మరోవైపు క్షీరాభిషేకం, మహా హారతులను కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా స్వయంభూగా వెలసిని స్వామి ఆలయానికి దేశవ్యాప్తంగాపేరు ఉంది. సాధారణ రోజుల్లో వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.