మొలకెత్తే పెళ్లి కార్డు.. ఆ హీరో కోసం వెరైటీగా..! - MicTv.in - Telugu News
mictv telugu

మొలకెత్తే పెళ్లి కార్డు.. ఆ హీరో కోసం వెరైటీగా..!

January 24, 2020

gvcgdf

సెలబ్రెటీలు, ప్రముఖుల పెళ్లి వేడుకలు అంటే చాలు హంగులు, ఆర్భాటాలు మామూలుగా ఉండవు. పెళ్లి పత్రికలకే పెద్ద ఎత్తున డబ్బు దారపోస్తారు.  రకరకాల డిజైన్ల వెరైటీలతో ఎవరూ చేయని విధంగా తమ స్టేటస్ చూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ దీనికి తాను పూర్తిగా విరుద్ధమని నిరూపించాడు కన్నడ నహీరో చేతన్. తన పెళ్లితో పర్యావరణానికి ఉపయోగపడాలనే సరికొత్త ఆలోచన చేశాడు. మొలకెత్తే పెళ్లి కార్డును తయారు చేయించి దాని ద్వారా ఆహ్వానాలు పంపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

హీరో చేతన్ తన ప్రియురాలు మేఘను ఫిబ్రవరి 2వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాడు.  దీని కోసం ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాలని అతని తల్లిదండ్రులు ఆలోచించారు. ఖరీదైన వెడ్డింగ్ కార్డు డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన ఆయన పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనుకున్నాడు. వెంటనే ఆహ్వాన పత్రికలో విత్తనాలు పెట్టి శుభలేఖను ప్రింట్‌ చేయించాడు. శుభలేఖను మట్టిలో వేసి నీరు పోస్తే మొలకెత్తే ఏర్పాటు చేయించాడు. ఇలా చేయడం వల్ల తన వంతుగా పర్యావరణ రక్షణ చేయడంతో పాటు చాలా మందికి ఆదర్శంగా ఉండవచ్చని భావించాడు. ఈ నిర్ణయాన్ని అందరూ అభినందించారు. మంచి పని కోసం ఇలా చేయడం గొప్ప విషయమని అంటున్నారు. కాగా చేతన్ వివాహం వల్లభ్‌ నికేతన్‌ వినోభాభావే ఆశ్రమంలో అతి కొద్ది మంది అతిథులతో నిర్వహించనుండటం విశేషం.