నడిరోడ్డుపై నటుడి వీరంగం.. చెంపలు వాయించిన ఫ్యాన్స్..
అభిమానం ఉన్నంత సేపు నటుడు ఎవరైనా ఫ్యాన్స్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాకాదని తోక జాడిస్తే మత్రం ఎవరైనా బెండు తీసేస్తారు. ఇలాగే ఫ్యాన్స్‌తో ఓవరాక్షన్ చేసిన కన్నడ నటుడు అభిమానుల చేతిలో దెబ్బలు తిన్నాడు. నడిరోడ్డుపై వీరంగం సృష్టించడంతో నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఈ వీడియో సంచలనంగా మారింది.
కన్నడ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హుచ్చా వెంకట్ కొడగు జిల్లాలో ఓ హోటల్‌కు వెళ్లాడు. తమ అభిమాన నటుడు వచ్చాడని తెలిసి స్థానికులంతా అతన్ని కలిసేందుకు ఎగబడ్డారు. అభిమానుల తీరుతో విసుగెత్తిన వెంకట్ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. కోపంతో ఓ కారుపై రాళ్లు విసిరి అద్దాలు పగలకొట్టాడు. కారు డోర్‌నూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసిన స్థానికులు అతన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు. కారును ఎందుకు ధ్వంసం చేశావంటూ ప్రశ్నించారు. వెంటనే పోలీసుసలకు ఫోన్ చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కన్నడలో ప్రసారమయ్యే బిగ్‌బాస్-3లో కూడా పాల్గొన్న వెంకట్ ఇలా విచిత్రంగా ప్రవర్తించడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.