Kannada Actor Shivaranjan Bolannavar Shot At, Escapes Unhurt
mictv telugu

కన్నడ హీరోపై కాల్పులు… సినీ ఫక్కీలో తప్పించుకున్నాడు

July 13, 2022

ప్రముఖ కన్నడ సినీ నటుడు శివరంజన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం సొంతూరులో ఉన్న తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లారు శివరంజన్. అదే రోజు రాత్రి ఆరుబయటకు వచ్చి నిలబడి ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి.. హీరోను చూసి హాయ్ అంటూ పలకరించాడు. అంతలోనే రివాల్వర్ తీసుకుని అతని మీద కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయితే సినిమాల్లో హీరోలు రివాల్వర్ బుల్లెట్ల నుంచి తప్పించుకున్నట్లు శివరంజన్ కూడా తప్పించుకోవడంతో అతడు ప్రాణాలతో భయటపడ్డారు. నటుడు శివరంజన్ ఓ కాలంలో ఓ మంచి నటుడిగా, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజారాణి, అమృతసింధు తదితర సినిమాల్లో శివరంజన్ హీరోగా నటించాడు. అమృతసింధు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో శివరంజన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

శివరంజన్ సొంత ఊరు బెళగావి జిల్లాలోని బైళహొంగల (మహారాష్ట్ర సరిహద్దు జిల్లా)లో ఉంది. నిన్న ఇంటి బయట మాట్లాడుతున్న సమయంలో బైక్ లో వెళ్లిన వ్యక్తి రివాల్వర్ తీసుకుని శిరంజన్ మీద కాల్పులు జరిపాడు. ఆ వెంటనే అక్కడి నుంచి బైక్ లో పారిపోయాడు.అయితే సినిమా ఫక్కీలో మూడు రౌండ్ల కాల్పులు జరిపినా శివరంజన్ తప్పించుకోవడంతో అతను ప్రాణాలతో భయటపడ్డాడు. విషయం తెలుసుకున్న బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్ సంజీవ్ పాటిల్, డీఎస్సీ శివనాంద కటగి, సీఐ సాకతేనహళ్లి సంఘటనా స్థలానికి చేరుకుని నటుడు శివరంజన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.