విషం తాగుతూ సెల్ఫీ తీసుకున్న నటి.. చివరకు ఇలా  - MicTv.in - Telugu News
mictv telugu

విషం తాగుతూ సెల్ఫీ తీసుకున్న నటి.. చివరకు ఇలా 

June 2, 2020

Kannada Actress Chandana Take Poison

రంగుల ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో సినిమా రంగంలోకి వచ్చింది. తీరా మోసానికి గురై అర్ధాంతరంగా తనువు చాలించింది ఓ నటి. కన్నడ ఇండస్ట్రీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆమె నిండు జీవితాన్ని విషాదాంతంగా ముగిసేలా చేసింది. నటి చందన తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెబుతూ..  సెల్ఫీ వీడియో తీసుకుంటూ విషయం తాగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

హాసన్‌ జిల్లా బేలూరుకు చెందిన చందన సినిమాల్లో నటించాలని బెంగళూరుకు వచ్చింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. అవకాశాల కోసం వెతుకుతోంది. ఆ సమయంలో దినేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. గత ఐదేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. తీరా పెళ్లి విషయం తీసుకురాగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె దినేశ్ ఇంటికి వెళ్లి నిలదీయగా.. అతడు అవమానించి పంపించాడు. ఈ విరక్తితో సోమవారం తన నివాసంలో పురుగుల మందు తాగింది. ఆ వీడియోను ప్రియునికి వాట్సప్‌ చేసింది. వెంటనే అతడు వచ్చి ఆమెను ఒక ఆస్పత్రికి తరలించి పరారయ్యాడు. ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియోలో తన డబ్బును, కెరీర్‌ను అతనికి అర్పిస్తే నిండా ముంచాడని వాపోయింది. దినేశ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు.