Kannada actress malasri daughter Radhana Ram debut move with darshan
mictv telugu

మాలాశ్రీ కూతురు ఎంట్రీ.. దర్శన్‌తో జోడీ

August 8, 2022

‘ప్రేమఖైదీ’, ‘బావ బావమరిది’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ నటి మాలాశ్రీ ఇంటి నుంచి ఓ హీరోయిన్ సిద్ధమైంది. ఆమె కూతురు రాధనా రామ్ తెరంగేంట్రం చేయనుంది. దర్శన్ హీరోగా రూపొందుతున్న ‘D56’ అనే కన్నడ చిత్రంతో రాధనా రామ్ నటిస్తోంది. ప్రముఖు నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ ఈ సినిమాను తీస్తుండంతో ఆసక్తి నెలకొంది. ఈ మూవీని కన్నడంతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లోనూ తీస్తున్నారు. ‘రాబర్ట్’ ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
దర్శన్‌ను శాండల్‌వుడ్‌లో ‘ఛాలెంజింగ్ స్టార్’ అంటారు. అతని సరసన అవకాశం దక్కడంతో రాధనా భవిష్యత్తు బావుంటుందని మాలాశ్రీ ఆశిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవల మంగళూరులోని రవిశంకర్ ఆశ్రమంలో మొదలైంది. తనను ఆదరించినట్టే తన కూతురినీ ఆదరించాలని మాలాశ్రీ కోరింది.