తారాస్థాయికి వివాదం.. రష్మికపై నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

తారాస్థాయికి వివాదం.. రష్మికపై నిషేధం

November 25, 2022

కన్నడ, తమిళ ప్రజల్లో అణువణునా ప్రాంతీయతత్వం ఉంటుంది. తమ భాష, సంస్కృతీకి ఏదైనా ఆపద వస్తే వెంటనే రోడ్డుకి ఎక్కేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆత్మాభిమానం కోసం ఫైట్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే దేశభక్తి కంటే తమ రాష్ట్రాలపైనే వారికి ప్రేమాభిమానాలు ఎక్కవ. అందుకే సొంత మనుషులు తమ రాష్ట్రానికి ఏ కాస్త తేడా చేసినా తట్టుకోలేరు. ప్రస్తుతం హీరోయిన్ రష్మికకి ఈ సెగ గట్టిగా తగులుతుంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ఇప్పుడు నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది రష్మిక. కానీ తానూ చేసిన ఒక చిన్న తప్పుకి ఇప్పుడు తన కెరీర్ ప్రమాదంలో పడింది. కన్నడ చిత్ర పరిశ్రమ గౌరవం తీసేలా రష్మిక ప్రవర్తిస్తుందన్నది ఆమెపై ప్రధాన ఆరోపణ. ఒక బాలీవుడ్ వేదికపై తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కన్నడ ప్రొడక్షన్ హౌస్ పట్ల గౌరవం లేకుండా కించపరించదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇప్పుడా వివాదం చినికిచినికి గాలివానై ఏకంగా కన్నడ పరిశ్రమ నుండి రష్మికని నిషేధించే వరకు వచ్చేసింది.

యూఏఈలోని ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు సైతం రష్మికపై వస్తున్న వార్తలను ఖరారు చేస్తూ ట్వీట్ చేశాడు. ‘‘కన్నడ సినిమాల్లో రష్మిక మందనను అధికారికంగా బ్యాన్ చేశారు. కన్నడ సినిమాలను ఆమె అగౌరవపరచడమే దీనికి కారణం’’ అని ఉమైర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. హీరో రక్షిత్ శెట్టి, దర్శకుడు రిషబ్ శెట్టిలు కిరిక్ పార్టీ చిత్రంతో రష్మికని కన్నడ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం చేశారు. అయితే ఈ గౌరవం ఇవ్వకుండా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ గురించి చెబుతూ ఆ సంస్థ పేరును ప్రస్తావించలేదు. అంతేకాకుండా, రెండు చేతులతో ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అనే అర్థమొచ్చేలా సైగలు చేస్తూ చెప్పారు. ఇది కన్నడ సినీ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. అంతే కాకుండా దేశం మెచ్చిన కాంతార మూవీ ఇంకా చూడలేదు అని అవమానకర వ్యాఖ్యలు చేసింది. దీంతో రష్మిక తదుపరి సినిమాలు ‘వారిసు’, ‘పుష్ప 2’ సినిమాలను సైతం కన్నడలో విడుదల కాకుండా అడ్డుకుంటారని జోష్యం చెబుతున్నారు. దీనిలో నిజమెంతుందో తెలీదు కానీ.. రష్మికను టార్గెట్ చేస్తూ నెగిటివ్ ట్వీట్లు అయితే మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.