సెల్ఫీ వీడియో రికార్డు చేసి..సినీ నిర్మాత ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ వీడియో రికార్డు చేసి..సినీ నిర్మాత ఆత్మహత్య

March 24, 2020

Kapali Mohan

హోటల్ నిర్వహణలో నష్టం రావడంతో సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులో కలకలం రేపింది. గంగమ్మగుడి పోలీసుస్టేషన్‌ పరిధిలోని బసవేశ్వర కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌కు దగ్గరలో సినీ నిర్మాత మోహన్‌ అలియాస్ కాపాలి మోహన్ సుప్రీం అనే హోటల్‌ను నిర్వహిస్తున్నారు. 

అయితే హోటల్ నిర్వహణలో నష్టం రావడంతో గత ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సదాశివనగరలో నివాసం ఉంటున్న మోహన్‌ తన స్నేహితుడు మంజునాథ్‌తో కలిసి డిన్నర్ చేశాడు. ఆదివారం అర్ధరాత్రి కొడుకుతో మాట్లాడాడు. కొడుకును ఇంటికి పంపి, మంజునాథ్‌తో కలిసి హోటల్‌కు చేరుకున్నాడు. మంజునాథ్‌ నిద్రలో ఉండగా మోహన్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. వీడియోలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, డిప్యూటీ సీఎం లక్ష్మణ సవదికి విన్నపం చేశాడు. తనకు హోటల్లో నష్టం వచ్చిందని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు.