Kannada Hero Rishab Shetty Controversial Comments On Bollywood
mictv telugu

బాలీవుడ్ పై కారుకూతలు.. తొలిసారి వివాదంలో కాంతార హీరో

November 10, 2022

తమ ప్రాంతాభిమానం ఇతర ప్రాంతాలకి అవమానం కలిగించేలా ఉండకూడదు. దాన్నే అతివాదం అంటారు కూడా. మన బాషా, రాష్ట్రంపై మమకారం ఉండొచ్చు అంతమాత్రాన ఎదుటివారిని కించపరిచొద్దు. తాజాగా కాంతార హీరో రిషబ్ శెట్టి అతి వ్యాఖ్యలు చేయటంపై బాలీవుడ్ ప్రేక్షుకులు మండి పడుతున్నారు. కాంతారతో తాజాగా భారీ విజయం దక్కించుకున్నాడు రిషబ్. కన్నడ, తెలుగు, తమిళంలో సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ హిందీ బెల్ట్‌లోను దూసుకెళ్తుంది. అక్షయ్ కుమార్ రామ్ సేతు, అజయ్ దేవగన్ థాంక్స్ గాడ్ వంటి పెద్ద చిత్రాలను కాంతార అధిగమించింది. దాంతో రిషబ్ శెట్టి సైతం పాన్-ఇండియా నటుడిగా మారిపోయాడు. బాలీవుడ్ లో వచ్చిన పాపులారిటీతో సహజంగానే మీ హిందీ మూవీ ఎప్పుడంటూ రిషబ్ కి ప్రశ్నలు వస్తాయి.

దీనికి హుందాగా సమాధానం చెప్పాల్సింది పోయి.. హిందీ ప్రేక్షకులని అవమానిస్తూ కర్ణాటకనే తనకి సర్వం అని సమాధానమిచ్చాడు రిషబ్. బాలీవుడ్ బబుల్‌తో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో, తనకు బాలీవుడ్‌లో పనిచేసే ఆలోచన లేదని రిషబ్ స్పష్టం చేశాడు. తనను తాను కన్నడిగగా గర్విస్తున్నానని, తనని ఆదరించి విజయాలని అందించిన కర్ణాటక ప్రజలకు, కన్నడ సినీ పరిశ్రమకు రుణపడి ఉంటానని అన్నారు. ఇక ఒక్క సినిమా హిట్టయినంత మాత్రాన నా కుటుంబం నా ఫ్రెండ్స్ మారరు. కన్నడ సినిమాలంటేనే నాకు ఇష్టం. అంటూ రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కన్నడ ప్రేక్షకులు రిషబ్ వ్యాఖ్యలని సమర్థిస్తుంటే హిందీ ప్రేక్షకులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటప్పుడు సినిమాని హిందీలో ఎందుకు రిలీజ్ చేశాడని మండిపడుతున్నారు.