Home > Featured > మైసూర్ పాక్ మాదే.. తమిళుల అన్యాయమైన డిమాండ్!

మైసూర్ పాక్ మాదే.. తమిళుల అన్యాయమైన డిమాండ్!

మైసూర్ పాక్ రెండు రాష్ట్రాలను మళ్లీ హాట్‌హాట్‌గా మార్చేసింది. రెండు రాష్ట్రాల్లోని మీడియా మొత్తం అమీతుమీ తేల్చుకుంటామని వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇప్పటికే మీకు అర్థం అయిపోయి వుంటుంది. మైసూర్ పాక్ పేరు ఎత్తగానే తియ్యని రుచితోపాటు కర్ణాటకలోని మైసూరు కూడా గుర్తుకొస్తుంది. కానీ తమిళనాడు ఆ స్వీట్ మాదే అని ఎప్పటినుంచో అంటోంది. అధికారికంగా అది ఫలానా రాష్ట్రానిది అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలో ఆ మిఠాయి గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది సంచలనంగా మారుతుంది. మరి తాజాగా ఆ మిఠాయి రేపిన కారం ఏంటో తెలుసుకుందాం.

ఆనంద్ రంగనాథన్ అనే జర్నలిస్టు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. మంత్రికి మైసూర్ పాక్ అందజేసిన రంగరాజన్ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మైసూర్ పాక్‌కు సంబందించిన భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్‌ను తమిళనాడుకు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ ఆమెకు మైసూర్ పాక్ ఇస్తున్న ఫోటోను రంగరాజన్ ట్వీట్ చేశారు.అతడు సరదాగా ఈ కామెంట్ పెట్టాడు. చమత్కారం గ్రహించని ఈ విషయాన్ని కన్నడ, తమిళ టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్ అంటూ వేసేశాయి. రచ్చ మొదలైంది. మైసూర్ పాక్‌కు భౌగోళిక గుర్తింపును కేంద్రం ఇచ్చిందంటూ బ్రేకింగ్ న్యూస్ వేయడంతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో గోల మొదలైంది. ఆనంద్ రంగనాథన్ చమత్కారంగా చేసిన ట్వీట్‌ను తప్పుగా తీసుకుని వార్త ప్రసారం చేయడంతో గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి భౌగోళిక గుర్తింపు మైసూర్ పాక్‌కు సంబంధించి ఎవరికీ ఇవ్వలేదు. అయితే న్యూస్ చానెళ్లు ఓవరాక్షన్ చేయడంతోనే గందరగోళం ఏర్పడింది. మైసూర్ పాక్‌ను మైసూర్ రాజు ఒకరు తన వంట మనిషితో చేయించాడని ప్రచారంలో ఉంది.

Updated : 17 Sep 2019 10:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top