దజీట్ బాలు.. తన పాత్రకు హీరోతో పాడించుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

దజీట్ బాలు.. తన పాత్రకు హీరోతో పాడించుకున్నాడు..

September 25, 2020

nvhbmnh

గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన సినిమా ఇండస్ట్రీలో గాయకుడిగా గాత్రాన్ని అందించారు. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర నటులకు పాటలు పాడారు. ఆయన మృతిని సంగీత ప్రియులు, యావత్ తెలుగు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన గాత్రంతో పాటు పలు సినిమాల్లో నటించారు కూడా. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించారు. కన్నడలో శశికుమార్ హీరోగా నటించిన ‘ముద్దిన మావ’ సినిమాలో బాలు నటించారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. ఈ సినిమాలో బాలు పాత్రకు రెండు పాటలు ఉంటాయి. తాను నటిస్తున్న సినిమాలో తన పాత్రకు తానే పాడుదామని బాలు అనుకున్నారట. ఇదే విషయాన్ని ఈ సినిమా దర్శకుడు ఓం సాయి ప్రకాశ్‌తో చెప్పాడట. శశికుమార్‌కు వేరే గాయకుడితో పాటలు పాడించాల్సిందిగా బాలు దర్శకుడిని కోరాడట. అందుకు దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన శశికుమార్ ఈ సినిమాలో తనకు బాలునే పాటలు పడాలని పట్టుబట్టారట. దీంతో బాలు కన్నడ ప్రముఖ నటుడు రాజ్ ‌కుమార్‌తో తన పాత్రకు పాటలు పాడించాలని నిర్ణయించారట. ఈ విషయాన్ని రాజ్‌ కుమార్‌కు వివరించగా తొలుత ఆయున ఒప్పుకోలేదట. ఒక సింగర్‌కి పాటలు పడితే అవి సరిగ్గా రాకపోతే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుందని రాజ్ కుమార్ అనుకున్నారట. అయినా కూడా బాలు ఆయన్ను వదలలేదట. తరచూ ఫోన్లు చేసి తన కోసం పాటలు పాడాలని కోరారట. దీంతో పాటలు సరిగ్గా వస్తేనే సినిమాలో వాడాలని రాజ్ కుమార్.. బాలుకి ఓ షరతు పెట్టరట. రాజ్ కుమార్ పాడిన పాటలు అద్భుతంగ ఉండడంతో వాటినే సినిమాలో వినియోగించారు. మొత్తానికి ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి రెండు పాటలను రాజ్ కుమార్‌తో పాడించడంలో బాలు సక్సెస్ అయ్యారు. ఈ సంఘటన అప్పట్లో సినీ పరిశ్రమలో చక్కర్లు కొట్టింది.