సీపీఐకి కన్నయ్య గుడ్ బై.. కాంగ్రెస్ లోకి జంప్! - MicTv.in - Telugu News
mictv telugu

సీపీఐకి కన్నయ్య గుడ్ బై.. కాంగ్రెస్ లోకి జంప్!

September 16, 2021

బీజేపీకి వ్యతిరేకంగా హల్ చల్ చేసే సీపీఐ యువ నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఆయన కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే ‘చేయి’ పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి . మనువాద్ సే ఆజాదీ, బ్రాహ్మణవాద్ సే ఆజాదీ అంటూ గతంలో చేసిన వివాదాస్పద నినాదాల ద్వారా దేశం మొత్తం కన్నయ్య కుమార్ పేరు మారుమోగింది.ఇ. కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కలసి పనిచేయాలని కన్నయ్య కుమార్‌ను పార్టీ కోరినప్పటికీ అది సాధ్యం కాలేదు.

ఈ నేపధ్యంలో పార్టీ కన్యయ్య కుమార్ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. తద్వారా పార్టీలో కొత్తతరం యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని, ప్రగతిశీల భావజాలం కలిగిన యువతను తమవైపు ఆకర్షించవచ్చునని, భూమిహార్ సామాజిక వర్గ మద్ధతును కూడా పొందవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో కాంగ్రెస్ పార్టీ బీహార్‌కు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. ఆ తరువాత కన్నయ్య కుమార్ ఎంట్రీ ఉండవచ్చని సమాచారం. కాగా, గుజరాత్ కు చెందిన దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కూడా కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.