80 కి.మీ. నడిచొచ్చి.. పెళ్లి చేసుకుందాం రా అంది..  - MicTv.in - Telugu News
mictv telugu

80 కి.మీ. నడిచొచ్చి.. పెళ్లి చేసుకుందాం రా అంది.. 

May 23, 2020

gnbfgb

పెళ్లిలకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రావడం లేదు. కరోనా పుణ్యమా అని శుభకార్యాలన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మూడుముళ్ల బంధంతో ఒక్కటి అవుదామని అనుకుంటున్న జంటలకు లాక్‌డౌన్ కొత్త చిక్కులు తెచ్చింది. ఎవరూ వేరే ఊళ్లకు ప్రయాణం చేసే అవకాశం లేదు. ఇలాగే  ఓ వధువు తన పెళ్లి వాయిదా పడకూడదని పెద్ద సాహసమే చేసింది. ఏకంగా 80 కిలోమీటర్లు ఒంటరిగా నడిచి వరుడికి ఇంటికి చేరుకుంది. పెళ్లి చేసుకుందాం పదా అంటూ వరుడితో ఏడు అడుగులకు సిద్ధమైంది. ఈ పెళ్లి స్థానికంగా అందరి నోట చర్చనీయాంశంగా మారింది. 

కన్పూర్‌‌‌లోని మంగల్బూర్ గ్రామానికి చెందిన గోల్డీ (19) వివాహం బైస్పూర్‌కు చెందిన వీరేంద్ర కుమార్‌తో మే 4న జరిపించాలని నిశ్చయించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ నెల 17కు వాయిదా వేశారు. మరోసారి కూడా లాక్‌డౌన్ పొడిగిస్తారనే వార్తలు రావడంతో ఇక అమ్మాయి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఈసారి ఏ మాత్రం వాయిదా వేసుకునే ప్రసక్తే లేదని ఒంటరిగా వరుడి ఇంటికి కాలినడకన చేరుకుంది. దాదాపు 80 కిలోమీటర్ల దూరం 12 గంటలపాటు నడిచి వచ్చింది. బ్యాగులో బట్టలతో ఆమె రాగానే అత్తింటి వారు షాక్ అయ్యారు. ఇక బంధువులు అంతా కలిసి ఓ గుడిలో సాదాసీదాగా వివాహం జరిపించారు. ఈ పెళ్లిపై ఆ వధువు సంతోషం వ్యక్తం చేసింది. ఈసారి పెళ్లి వాయిదా పడకూడదనే నడిచి వచ్చినట్టు వెల్లడించింది.