ఈ పిల్లల పేర్లు…కాన్షీరాం,మాయావతి..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పిల్లల పేర్లు…కాన్షీరాం,మాయావతి..!

July 1, 2017

బిడ్డ పుట్టగానే ఏం పేరు పెట్టాలి..ఏం పేరు పెట్టాలి అని ప్రతి తల్లీ తండ్రి ఆలోచిస్తుంటారు,కొందరేమో వాళ్ల తాత ముత్తాత అమ్మ అమ్మమ్మల పేర్లు పెడితే,ఇంకొందరు గ్రహాల ప్రకారం..ఇష్టమైన దేవుళ్ల పేరో లేక సిన్మాయాక్టర్ల పేర్లో పెడతారు, కానీ లైఫ్ లో తమను ఇన్స్పైర్ చేసిన వాళ్ల పేర్లు.. తమ పిల్లలకు పెట్టేవాళ్లు చాలా తక్కువమందుంటారు.కమ్యూనిస్ట్ భావాలున్న కొందరు..తమ పిల్లలకు లెనిన్,ఫిడేల్ క్యాస్ట్రో వంటి విప్లవకారుల పేర్లూ పెడతారు.

ఈ  ఆఫీసర్ కొంచెం డిఫరెంట్..!

ఈ  ఆఫీసర్ పేరు ఏనుగుల చైతన్య మురళి..ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లాకు ప్రస్తుతం డిప్యూటీ కమీష్ నర్ ఆఫ్ ప్రొహిజిషన్ &ఎక్సైస్ ఆఫీసర్..అంతేకాదు ఒక సామాజిక సేవకుడు..బుద్దుడిపై ఎన్నో పుస్తకాలు రాసారు,అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు,తమ కొడుకు బిడ్డెకు కాన్షీరాం,మాయావతి  అని పేర్లు పెట్టాడు,మరుగునపడ్డ బహుజన జీవితాలను,ఉద్యమాలను వెలికి తీసి చరిత్రను తిరగరాసి బహుజన సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ‘’కాన్షీరాం’’  అనే మహానుభావుని పేరు తన కొడుక్కు పెట్టుకున్నాడు,అలాగే “మాయావతి”,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జావత్ అనే ఒక అట్టడుగు తెగలో పుట్టి ..ఎన్నో అడ్డంకులను అవరోధాలను దాటుకొని ఆ రాష్ట్రానికి సియం అయ్యి… మనదేశంలోనే తొలి దళిత మహిళా సియంగా చరిత్ర సృష్టించింది..ఇలా ఆమె పేరును బిడ్డెకు పెట్టుకున్నడు, పిల్లల పేర్లు ట్రెండీగా ఉండాలి,కొత్తగా ఉండాలి అనీ గూగుల్లో వెతికి అక్కడా ఇక్కడా వెతికి బుర్రలు బద్దలు కొట్టుకొని డిఫరెంట్ పేర్లను తమ పిల్లలకు పెట్టే తల్లిదండ్రులున్న ఈకాలంలో కూడా..

ఇంత డిఫరెంట్ గా ఆలోచించిన ఈ సార్ను మనం మెచ్చుకోవాల్సిందే,ఇంకో విషయం ఏంటంటే ఒక జిల్లా  అధికారి అయ్యుండి గుడ తమ పిల్లలు సామాన్యులుగా పెరిగి తమ కాళ్లపై నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న కోరికతో వారిని గవర్నమెంట్ స్కూల్ లో చదివిస్తున్నడు. నిజంగా సామాజిక భాద్యత పట్ల..చరిత్ర సృష్టించిన,చరిత్రను తిరగ రాసిన మహానుభావుల పట్ల ఈ సారుకున్న గౌరవానికి మనంమందరం సలాం చెయ్యాల్సిందే.కాన్షీరాం,మాయావతి అనే పేర్లను సార్థకం చేసుకునేంత ఎత్తుకు ఈసారు పిల్లలు ఎదగాలని..మరో చరిత్రను తిరగ రాయాలని ఆశిద్దాం.ఒక కాన్షీరాం,మాయావతే కాదు,మనదేశ గడ్డమీద పుట్టి చరిత్ర తిరగ రాసిన మహానుభావులెందరో వాళ్లలో ఎందరి పేర్లను మన పిల్లలకు పెడుతున్నామో ఓ పారి ఆలోచిద్దాం.