Kantara holds the No 1 position in the list of India’s Current Top 250 Films, earns Rs 9 cr in Hindi version on Day 4
mictv telugu

కాంతారకు 1వ ర్యాంక్, బాహుబలికి 101వ ర్యాంక్

October 19, 2022

Kantara holds the No 1 position in the list of India’s Current Top 250 Films, earns Rs 9 cr in Hindi version on Day 4

ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కాంతార, కాంతార! 16 కోట్ల బడ్జెట్‌తో చిన్న మూవీగా తయారై ఇప్పటికే 100 కోట్లు వసూలు చేసిన ఈ కన్నడ మూవీ, డబ్బింగ్ వెర్షన్లలోనూ దుమ్మురేపుతోంది. చివరి 15 నిమిషాల కోసమైనా తప్పకుండా మూవీ చూడాలని జనం రెకమండ్ చేస్తున్నారు.

థియేటర్లలో పూనకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందో ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీలో దీనికొచ్చిన ర్యాంకే తిరుగులేని ఉదాహరణ. 2022 సంవత్సరానికిగాను భారతీయ చలనచిత్రాల నుంచి ఎంపిక చేసిన 250 టాప్ మూవీల్లో కాంతారకు 1వ ర్యాంకు దక్కింది. బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి1కు 101వ ర్యాంకు, బాహుబలి 2కు మరింత 182వ ర్యాంకు దక్కడం గమనార్హం. టాప్ 10లో కాంతారతోపాటు మరో కన్నడ మూవీ చార్లీ కూడా ఉండగా ఒక్క తెలుగు మూవీ కూడా లేకపోవడం విశేషం. టాప్ 20లో టాలీవు నుంచి ఒక మూవీకి చోటే దక్కింది.

టాప్ టెన్ జబితా

1. కాంతార (8.5)
2. రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా (8.5)
3. రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్ (8.4)
4. అన్బే శివం (8.4)
5. నాయకన్ (8.4)
6. హంకీ పంకీ (8.4)
7. జై భీమ్ (8.4)
8. 777 ఛార్లీ (8.4)
9. పరియేరుమ్ పెరుమాళ్ (8.4)
10. మణిచిత్రతాఝు (8.4)

తెలుగు మూవీలు, ర్యాంకులు

కంచరపాలెం (17)
జెర్సీ (22)
సీతారామం (39)
మహానటి (44)
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (48)
బాహుబలి: ది కన్‌క్లూజన్ (101)
బొమ్మరిల్లు (125)
రంగస్థలం (129)
అతడు (134)
పెళ్లి చూపులు (146)
ఎవరు (155)
క్షణం (156)
మేజర్ (165)
వేదం (176)
అర్జున్ రెడ్డి (179)
బాహుబలి: ది బిగినింగ్ (182)
ఆర్ఆర్ఆర్ (190)
ఒక్కడు (209)
పోకిరి (212)
మనం (217)
ఊపిరి (220)
హ్యాపీడేస్ (236)
గూడఛారి (244)