Kantara is releasing on November 24 in OTT
mictv telugu

ఓటీటీలోకి కాంతార.. అఫీషియల్ డేట్ వచ్చేసింది

November 17, 2022

Kantara is releasing on November 24 in OTT

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన కాంతార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు కలెక్షన్లు సాధించింది. తుళునాడు ప్రాంతంలోని గిరిజన ఆచార, సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్ని ప్రముఖ భాషల్లో రిలీజై అందరి మన్ననలు పొందింది.

డైరెక్టర్ కం హీరో రిషభ్ షెట్టి ప్రతిభను బడా సెలబ్రిటీలు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. థియేటర్లో మాత్రమే వచ్చిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అమెజాన్ హెల్ప్ ప్రకటించింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘మీ ఆతృతను అర్ధం చేసుకున్నాం. ఈ టైటిల్‌తో ఉన్న సినిమా నవంబర్ 24న స్ట్రీమింగ్ కాబోతుంది’ అని ట్వీట్ చేసింది. దీంతో ఓటీటీలో కూడా రికార్డు స్థాయి వ్యూస్ రావడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.