kantara movie collections beat godfather collections in nizam
mictv telugu

గాడ్ ఫాదర్ కి షాక్.. ముందంజలో కాంతార.. ఫైనల్ విన్నర్ ఎవరంటే ?

November 3, 2022

టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవిది ఒక విచిత్రమైన పరిస్థితి. సినిమా చూసిన ఆడియన్స్ అంతా మూవీకి జేజేలు కొడుతున్నారు. క్రిటిక్స్ అందరు పాజిటీవ్ రివ్యూస్ ఇచ్చారు. ఇక మొదటి వారం కలెక్షన్స్ సైతం రికార్డు స్థాయిలోనే వచ్చాయి. కానీ అంతలోనే అనుకోని అవాంతరం. సెకండ్ వీక్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ దాటి.. మూడవ వారం గాడ్ ఫాదర్ లాభాల బాట పడుతుందనుకున్న సమయంలో టాలీవుడ్ బాక్సాఫీస్ పై కాంతార దాడి చేయటం మొదలుపెట్టింది. అల్లు అరవింద్ రిలీజ్ చేసిన తెలుగు వెర్షన్ మ్యాజిక్ చేస్తుంది. ఈ సినిమా నైజంలో ఇప్పటికే 11కోట్లు వసూల్ చేసి.. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.

ఊరుపేరు లేని ఒక చిన్న కన్నడ చిత్రం కాంతార.. గాడ్ ఫాదర్ ని ఈ స్థాయిలో దెబ్బకొడుతుంది అనుకుంటే బహుశా అల్లు అరవింద్ సైతం ఇంకొన్ని వారల తరువాత కాంతారని విడుదల చేసేవాడేమో. కానీ గాడ్ ఫాదర్ కి కాంతార చేయాల్సిన డ్యామేజ్ చేసేసినట్టే. మెగాస్టార్ అడ్డ అయిన నైజాంలో గాడ్ ఫాదర్ ని కాంతార బీట్ చేసేయబోతుందని తెలుస్తుంది. నైజాంలో గాడ్ ఫాదర్ కి 12 కోట్లు కలెక్షన్లు వస్తే కాంతారా ఇప్పటికే నైజాంలో పదకొండు కోట్లు దాటేసి.. సునాయాసంగా మరో 4కోట్లు కలెక్ట్ చేయనుందని ట్రేడ్ టాక్. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వైజాక్ లో మాత్రమే గాడ్ ఫాదర్ కి లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. 4కోట్ల బిజినెస్ జరిగిన విశాఖలో గాడ్ ఫాదర్ ఆరు కోట్లు రాబట్టినట్టు సమాచారం.