కాంతార మూవీకి ఎదురుదెబ్బ.. కోర్టు తీర్పు ఇదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

కాంతార మూవీకి ఎదురుదెబ్బ.. కోర్టు తీర్పు ఇదీ..

October 29, 2022

కన్నడ మూవీ కాంతారా తెలుగుతోపాటు హిందీలో డబ్ అయి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వివాదాలకూ కొదవ లేదు. సినిమాలో చూపించిన భూతకోల నృత్యం హిందూమతానాకి కాదని ఒక వివాదం. అలాగే ‘వరాహ రూపం’ పాట వాడిన సంగీతం కూడా కాపీ కొట్టారని ఆరోపణ. ఈ సంగీతం తమదని కేరళకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే సంగీత బృందం కోజికోట్ సెన్సన్ కోర్టులో కేసు పెట్టింది. ఈ కేసుపై కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించి తైక్కుడంకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇకపై మూవీలో ఈ పాటను ప్రదర్శించకూడా ఆదేశాలు జారీ చేసింది.

సినిమాల్లోనే కాకుండా అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్ వంటి ఆన్‌లైన్ ప్రసార వేదికల్లోనూ ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. దీంతో సినిమాకు వన్నె తెచ్చిన ఈ పాటను ప్రేక్షకులు చూసే వీలు లేకపోవచ్చు. అయితే ఈ వివాదంపై మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు. తైక్కుడం సంస్థతో బేరసారాలు సాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాజీ కుదరకపోతే పాతను తీసేయడం తప్ప మరో గత్యంతరం ఉండకపోవచ్చు. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా తెరకెక్కిన కాంతార మూవీ నిర్మాణానికి 16 కోట్లు ఖర్చుకాగా ఇప్పటికే దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.