Kantara movie worldwide collections close to 400 crores
mictv telugu

400 కోట్లకు చేరువలో కాంతార కలెక్షన్లు.. ఓటీటీలో ఎప్పుడంటే

November 8, 2022

Kantara movie worldwide collections close to 400 crores

కన్నడలో చిన్న చిత్రంగా రిలీజైన కాంతార సినిమా బంపర్ హిట్ కొట్టేసింది. ఈ క్రమంలో కేజీఎఫ్ సిరీస్ సినిమాలను కూడా కన్నడలో బీట్ చేసి కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని ప్రధాన భాషల్లో అనువాదమై విడుదలైన ప్రతీచోటా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలై ఇన్ని రోజులైనా కాంతార క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

ఇప్పటికీ వారాంతాల్లో చాలా మంది ప్రేక్షకుల ఛాయిస్ ఈ సినిమానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్రానికి వస్తున్న కలెక్షన్లే ఇందుకు నిదర్శనం. దాంతో పాటు టాలీవుడ్‌లో కానీ, బాలీవుడ్‌లో కానీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో కాంతారకు ఎదురు లేకుండా పోయింది. ఇలాంటి కథలు, సినిమాలు ప్రేక్షకులకు కొత్త కాకపోయినా సినిమాలోని సహజత్వం, కథలోకి దేవుడిని జొప్పించిన తీరు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో అనేక రికార్డులు కాంతారకు పాదాక్రాంతం అవుతున్నాయి. కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పటివరకు ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 400 కోట్లను కొల్లగొట్టినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. తెలుగు భాషలో 48 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో అయితే కేజీఎఫ్ తర్వాత రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టిన రెండో కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ నవంబర్ 18న ఉండే అవకాశం ఉంది. దీని కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి అక్కడ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.