రష్మికపై ట్రోలింగ్‌‌కి కారణం కాంతార రిషభ్ షెట్టి.. ఎలాగంటే - MicTv.in - Telugu News
mictv telugu

రష్మికపై ట్రోలింగ్‌‌కి కారణం కాంతార రిషభ్ షెట్టి.. ఎలాగంటే

November 10, 2022

అందం, అభినయంతో అనతికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో దేశవ్యాప్త క్రేజ్ సొంతం చేసుకుంది. నేషనల్ క్రిష్మికగా మీడియా ప్రశంసలందుకుంది. అయితే రష్మిక తాజాగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌‌పై స్పందించింది. విపరీతమైన దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. అయితే ఆమెపై ఎవరు ట్రోలింగ్ చేశారు? ఎందుకు చేశారో తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా ఉంది. ఇప్పుడు దానికి సమాధానం వచ్చేసింది. దీనంతటికీ కారణం కాంతార సినిమాతో నేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు కం హీరో రిషభ్ షెట్టినే. ఈ చిత్రాన్ని అన్ని భాషల ఇండస్ట్రీ పెద్దలు మెచ్చుకున్నారు. చివరి 20 నిమిషాలు సినిమా కట్టిపడేసిందని రజనీకాంత్, ఆర్జీవీ, కన్నడ బ్యూటీలైన అనుష్క షెట్టి, పూజాహెగ్డేలు మీడియా ముఖంగా చెప్పేశారు. ఈ చిత్రంపై రష్మికను స్పందన అడిగితే చిత్రాన్ని ఇంకా చూడలేదని చెప్పిందంట. రిషభ్ షెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ సినిమాతోనే రష్మికకు కెరీర్‌‌లో తొలి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఆయనే హీరోగా వచ్చిన కాంతారను చూడలేదని చెప్పడంతో కన్నడిగులు ఒక ఆట ఆడేసుకున్నారు.

 

నువ్వు కన్నడ రాజ్యోత్సవ నాడు విష్ చేయలేదు. నీకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడి కాంతార సినిమాను చూడలేదు. నువ్వు కన్నడ పరిశ్రమలో ఉండాల్సిన అవసరం లేదని ఒకరు, నీ వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం. కానీ, కిరిక్ పార్టీ టీమ్‌పై నువ్వు కృతజ్ఞత చూపలేదు. చార్లి సినిమాకి శుభాకాంక్షలు చెప్పలేదు. కాంతార ను వీక్షించలేదు. కానీ, ఇతర భాషలకు చెందిన చిత్రాలపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తావు అని మరో నెటిజన్ విమర్శించాడు. ఇలా పలు రకాలుగా ట్రోలింగ్ జరగడంతో ‘నటిగా కెరీర్ మొదలైనప్పటి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇండస్ట్రీలో అందరి ప్రేమ పొందడం సాధ్యం కాదు. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టకూడదు. నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తా’నంటూ వివరణ ఇచ్చింది. ఇక ఈ ఇష్యూతో తిక్క రేగిందో ఏమో కానీ, రిషభ్‌ని ఓ బాలీవుడ్ మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తూ.. రష్మిక, సమంతలో ఎవరి నటనను మీరు ఇష్టపడుతారని అడిగితే వెంటనే సమంత అని జవాబిచ్చాడు రిషభ్ షెట్టి. ఈ వీడియోను కన్నడిగులు తెగ వైరల్ చేస్తున్నారు.