Kantha Rao's sons are asking for help
mictv telugu

ప్లీజ్ మాకు ఇల్లు ఇవ్వండి..కాంతారావు కొడుకు

November 17, 2022

తెలుగు చిత్రపరిశ్రమలో చెప్పుకోదగ్గ నటుల్లో అలనాటి హీరో కాంతారావు ఒకరు. పౌరాణిక.. జానపద.. సాంఘిక చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కొన్ని వందల చిత్రాల్లో విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షుకులను అలరించారు. అంతటి పేరున్న హీరో కుటుంబం ప్రస్తుతం దీనావస్థలో ఉంది. అప్పటి హీరోలు, వాళ్ల వారసులు కోట్లు సంపాదించుకుంటే కాంతారావు కుమారులు మాత్రం ఉండడానికి కనీసం ఇళ్లు లేక అద్దె నివాసంలో ఉంటున్నారు. సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

బుధవారం కాంతారావు శతజయంతి ఉత్సవాలను రవీంభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రి ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీశారని.. ఒకప్పుడు మద్రాసు బంగ్లాలో ఉన్న మేము.. ఇప్పుడు సిటీకి దూరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామంటూ వాపోయాడు. పరిశ్రమ నుంచి తమకెలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఓ ఇల్లు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.