కోహ్లి, రోహిత్, రాహుల్‌పై కపిల్‌ దేవ్ ఆగ్రహం..ఆటగాళ్లను మార్చేయాలి.. - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లి, రోహిత్, రాహుల్‌పై కపిల్‌ దేవ్ ఆగ్రహం..ఆటగాళ్లను మార్చేయాలి..

June 6, 2022

భారత మాజీ క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్ టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై, రోహిత్‌ శర్మపై, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ‘వాళ్లకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒత్తిడి సహజం. కేవలం దానిని సాకుగా చూపితే సరిపోదు. ఒత్తిడిని అధిగమించి బ్యాట్‌ ఝులిపించగలగాలి. వాళ్లకు 150-160 స్ట్రైకు రేటుతో బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉంది. కానీ, ఎప్పుడైతే వాళ్లు మెరుగైన స్కోరు సాధించాలని మనం కోరుకుంటామో అప్పుడే చేతులెత్తేస్తారు. అప్పుడు ఇంకాస్త ఒత్తిడి ఎక్కువవుతుంది’ అని అనకట్‌ యూట్యూబ్‌ చానెల్‌లో ఆయన పేర్కొన్నారు.

ఇక, కేఎల్‌ రాహుల్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌-1లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అతడి ఆట తీరు గురించి చెప్పాలంటే.. ” 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుందంటే, దాని అర్థం కేవలం 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం కాదు. ఇలా చేస్తే జట్టుకు అన్యాయం చేసినట్లే. ఆడే విధానం మార్చుకోవాలి. కుదురకపోతే ఆటగాళ్లను మార్చేయాలి. భారీ అంచనాలు ఉన్న ఆటగాడిగా బాగా ఆడతాడనే ఎవరైనా ఊహిస్తారు.పేరు ప్రఖ్యాతులు ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్లు రాణించాలి” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.