టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఎంతగానో సక్సెస్ అవుతోంది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెద్ద ఎత్తున ఈ ఛాలెంజ్లో స్వచ్చందంగా పాల్గొని మొక్కలు నాటుతున్నారు. అలాగే తమ స్నేహితులను కూడా ఛాలెంజ్ చేస్తూ వారితో కూడా మొక్కలు నాటిస్తున్నారు.
తాజాగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈరోజు ఢిల్లీలోని సుందర్ నగర్ తన నివాసంలో కపిల్ దేవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ..’గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వాతావరణ కాలుష్యం తగ్గి మంచి వాతావరణం కావాలని ఆశిద్దాం. అందుకోసం భారతీయులందరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత.’ అని తెలిపారు.