వీరుడా.. భావుకుడా..  నీ మరణం వృథా కాదు.. ! - MicTv.in - Telugu News
mictv telugu

వీరుడా.. భావుకుడా..  నీ మరణం వృథా కాదు.. !

February 6, 2018

కుక్కతోక వంకర అన్నట్టుగానే ఉన్నాయి  పాకిస్తాన్ సైనికుల చర్యలు.  కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ  పాశవికంగా  ఆదివారం రాత్రి అకస్మాత్తుగా  సరిహద్దులో కాపలాగా ఉన్న భారత జవాన్లపై  కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో  కపిల్ కుందు, రామావతార్, శుభమ్ సింగ్, రోషన్  అనే నలుగు జవాన్లు  మృతి చెందారు. కపిల్ కుందు అనే జవాను చనిపోయే ముందు చివరిసారిగా తన ఫేస్‌బుక్ పేజీలో  ఓ పోస్ట్ పెట్టాడు.

 ‘ఎన్నేళ్ళు బతికామన్నది కాదు.. ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం‘ అంటూ ఆ జవాన్ ఎన్ కౌంటర్‌కు  కాసేపు ముందు సోషల్ మీడియాలో రాశాడు.  ఆ పోస్ట్ చూసిన భారతీయల గుండెలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరు  పాకిస్తాన్  సైనికులపై కన్నెర్ర  జేస్తున్నారు.

జవాన్ల మరణంపై  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్  కూడా విచారణ వ్యక్తం చేశారు.  ఇంతకు ఇంతా  పాక్ ‌  ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన  సైనికులకు సూచించారు.  పాక్‌‌పై మరో సర్జికల్ దాడి చెయ్యాలని  భారత ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో తెలీదు. మన జవాన్లను  అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఆ జవాన్ల ఆత్మకు శాంతి కలగాలి. వాళ్ల త్యాగం వృథా కాకూడదు  అని ఆయన జవాన్లకు సూచించారు.

కపిల్ కుందు ఫేస్ బుక్‌లో రాసిన కవితలు..

పరిగెత్తు.. జీవితమే ఒక పరుగు

పరిగెత్తలేకపోతే  నడువు.. నడవలేకపోతే.. కనీసం నేలపై పాకు

అంతేగాని విరామం తీసుకోకు.. గమన్యం చేరే దాకా విశ్రమించకు..

ఎన్నాళ్ళు బతికామన్నది కాదు..ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం..

బతుకు, మరణం అన్నీ జీవనపథంలో ఒక భాగం

మరణమే మన చివరి చరణం కాదు..

ఒక అమరుడి కథ

ఇక అంతా ముగిసిపోయిందని ఆమె అనుకుంది.. అతను శాశ్వతంగా వెళ్లిపోయాడని అంతా అనుకున్నారు.. కానీ అతను తెచ్చిన పువ్వుల్లో తను  బతికే ఉన్నాడు..

ఆ పూలు ఎన్నో ముచ్చట్లు చెబుతాయి.. అతని భావాలకు బాట చూపుతాయి

ఎపుడూ అనుకునేవాడు అమె లేనిదే ఏమీ లేదని..తన బతుకే వేరని!

అతనికి జీవించడం ఓ అవకాశం..

అందుకే పూలమ్మేవాడికి ముందే డబ్బిచ్చేశాడు! పూలు అలా వస్తూనే ఉన్నాయి..

పుట్టిన రోజు..పెళ్లిరోజూ..  ప్రతి సందర్భంలో శుభాకాంక్షలు ఆమెకు చెబుతూనే ఉన్నాయి!

ఆమె పూలను  తన హృదయానికి హత్తుకుంది..

ప్రతి పువ్వులో అతణ్ని చూసుకుంది! అతని నిష్క్రమణ గురించి ఆలోచిస్తోంది

పూలు వస్తూనే  ఉన్నాయి.. జీవనరథం సాగిపోవాలని ఆమెకు చెబుతూనే ఉన్నాయి.

ఆమె పూలు  పట్టుకుని  రోదించింది..  నవ్వింది!

జీవితం, మరణం….

ఇవేమీ అతనికి పెద్ద విషయాలు కావని అంటోంది!!