కపిల్ షోలోకి సునీల్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడా ? - MicTv.in - Telugu News
mictv telugu

కపిల్ షోలోకి సునీల్ మళ్ళీ ఎంట్రీ ఇస్తాడా ?

August 8, 2017

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెంబర్ వన్ కామెడీ టీవీ షో ‘ కామెడీ నైట్స్ విత్ కపిల్ ’. సోనీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రాంకు తొలత నుండీ తెర వెనుక వివాదాలు సర్వ సాధారణంగానే మారాయి. కపిల్ కు, సునీల్ గ్రోవర్ కు మధ్య వివాదం మొదలై సునీల్ షో నుండి తప్పుకున్నాడు. గుత్తిగా, డాక్టర్ గా, కపిల్ కు మామగా ఇలా మూడు పాత్రల్లో కనిపించి కడుపుబ్బా నవ్విస్తాడు సునీల్ గ్రోవర్. అతను షో నుండి తప్పుకోవడం ప్రేక్షకులకు ఏదో మిస్సైన ఫీలింగైతే వుంది.

గతంలో కూడా సునీల్ షో నుండి తప్పుకొని వేరే టీవీ చానళ్ళో సపరేట్ కామెడీ షో చేస్కున్నాడు కానీ అది ఎందుకో వర్కౌట్ అవలేకపోయింది ? మళ్ళీ కపిలే స్వయంగా వెళ్ళి సునీల్ ను తన షోలోకి రప్పించుకున్నాడు. తర్వాత షో ఒక ఊపు అందుకుంది. కలర్స్ ఛానల్ అగ్రిమెంటు పూర్తవగానే సోనీ టీవీతో అగ్రిమెంటు కుదుర్చుకొని ‘ ది కపిల్ శర్మ షో ’ పేరిట కొనసాగుతోంది. ఈ క్రమంలో మళ్ళీ కపిల్ శర్మకు, సునీల్ గ్రోవర్ కు మధ్య ఏం వివాదం తలెత్తిందో గానీ ఇద్దరూ కొట్టుకునే వరకు పోయింది వ్యవహారం. ఇంత జరిగాక అతను సడన్ గా షో నుండి నిష్ర్కమించాడు. కపిల్ తనను మళ్ళీ షోలోకి తీస్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సోనీ ఛానల్ తో కూడా అగ్రిమెంట్ దగ్గర పడ్డ కారణంగా ఇంకా వేరే ఏ ఛానల్ లో ప్రసారం అవుతుందనే దాని మీద స్పష్టత లేదు.

అలాగే ఈ షో రూపు రేఖలు కూడా మారిపోతాయంటున్నాడు కపిల్. ఇప్పటి వరకున్న దాది, పలక్, లచ్చ వంటి పాత్రలు వేరే గెటప్పులో అలరిస్తాయట. భారతి సింగ్ రాకతో షోలో నవ్వులు మరింత ఎక్కువైనా సునీల్ లోటును ఎవరూ పూడ్చలేరని అటు ప్రేక్షకులు, ఇటు కపిల్ కూడా విశ్వసిస్తున్నాడు. మాజీ క్రికెటర్ సిద్దూ ఈ విషయంపై స్పష్టతను కపిల్ కే వదిలేసాడు. చూడాలి మరి ఈ కార్యక్రమం ఎన్ని మార్పులతో రానుందో. క్లీన్ యూ కామెడీతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన కపిల్ షో తప్పకుండా మళ్ళీ మంచి మార్పులతో వస్తుందని ఆశిస్తున్నారు ఈ షో ఫ్యాన్స్.