కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి కపిల్ సిబల్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి కపిల్ సిబల్ రాజీనామా

May 25, 2022

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ రాజకీయ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. యూపీలోని సమాజ్ వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీకి ఈ నెల 16న రాజీనామా చేశానని, ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నట్టు తెలిపారు. అనంతరం లక్నోలో బుధవారం అఖిలేష్ యాదవ్‌తో కలిసి రాజ్యసభ సీటుకు నామినేషన్ వేశారు. ఈ విషయంపై అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ఎంతో అనుభవం ఉన్న కపిల్ సిబల్‌ను కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదని, మా పార్టీ తరపున రాజ్యసభకు పంపిస్తున్నట్టు తెలిపారు.

తాను ఈ నెల 16వ తేదీ నాడే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని సిబల్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకత్వంలో మార్పులపై ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కాకుండా కీలక నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారని ఆక్షేపిస్తున్నారు. గాంధీ కుటుంబ నాయకత్వం నచ్చకే ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది.