Kapu Ramachandra Reddy has resigned from the post of Anantapur YCP District President
mictv telugu

వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా

November 8, 2022

Kapu Ramachandra Reddy has resigned from the post of Anantapur YCP District President

ఏపీలో అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కాపు రామ చంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌‌‌కు లేఖ రాశారు. తన కుటుంబంలో ఇటీవల జరిగిన విషాదంతో పాటు సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

పై కారణాలతో జిల్లా అధ్యక్ష పదవిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నానని, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాల్సి ఉండడంతో రెండు పదవులకు న్యాయం చేయలేకపోతున్నానని లేఖలో వాపోయారు. తనపై నమ్మకంతో ఇంతవరకు ఈ బాధ్యతలు అప్పగించిన జగన్‌‌కి ధన్యవాదాలు తెలుపుతూ.. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మన్నించి రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు. కాగా, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో ఇటీవల విషాద ఘటన చోటు చేసుకుంది. అయన అల్లుడు మంజునాథ రెడ్డి తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య స్రవంతి డాక్టరుగా పని చేస్తున్నారు.