పాక్ విమానం ఇలా కూలిపోయింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ విమానం ఇలా కూలిపోయింది (వీడియో)

May 22, 2020

Karachi plane crash video footage from a CCTV camera

పాకిస్తాన్‌లో ఈ రోజు మధ్యహ్నం కుప్పకూలిన విమానంలో ప్రయాణించిన వారందరూ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లాహోర్ నుంచి బయల్దేదిన విమానం కరాచీలోని జిన్నా ఎయిర్ పోర్టులో లాండ్ అవుతూ కుప్పకూలింది. 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ప్రయాణించిన విమానం కుప్పకూలిన దృశ్యం ఓ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డైంది. విమానం బాగా కిందికి వచ్చిన ఒక్కసారిగా కూలిపోయింది. క్షణాల్లోనే భారీ ఎత్తున పొగ కనిపించింది. ప్రమాదానికి ముందు.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పైలెట్ కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. మృతుల సంఖ్య, క్షతగాత్రులెందరు వంటి విషయాలను ప్రభుత్వం చెప్పడం లేదు.