Karan gave clarity..that's why Taapsee was not called
mictv telugu

క్లారిటీ ఇచ్చిన కరణ్..తాప్సీని అందుకే పిలువలేదు

September 30, 2022

 

బాలీవుడ్‌లో ‘కాఫీ విత్ కరణ్’ షో ఎంతపెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో మొదలై, ఇప్పటికి 7 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ 7వ సీజన్‌లో జంటగా ఇప్పటివరకూ..ఆమీర్ ఖాన్ – కరీనా కపూర్, జాన్వీ కపూర్ – సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ – సమంత, అలియా భట్ – రణవీర్ సింగ్, విజయ్ దేవరకొండ – అనన్యా పాండే, సిద్ధార్థ్ మల్హోత్రా – విక్కీ కౌశల్ మొదలైనవారు హాజరై, పలు సంచలన విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలో హీరోయిన్ తాప్సీ గతంలో ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యులో ‘కాఫీ విత్ కరణ్’ షోపై పలు బోల్ట్ కామెంట్స్ చేయడంతో అప్పట్లో సంచలనంగా మారింది. ‘ తాప్సీని ఎందుకు ‘కాఫీ విత్ కరణ్ షో’కి ఆహ్వానించటం లేదు’ అని యాంకర్ ప్రశ్నించగా, దానికి తాప్సీ..”కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొనేంత గొప్పగా నా శృంగార జీవితం లేదు” అంటూ బోల్డ్‌ సమాధానం ఇచ్చింది.

తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ వ్యాఖ్యాత, దర్శక నిర్మాత కరణ్ జొహార్ తాప్సీని తన షోకు ఎందుకు ఆహ్వానించలేదో క్లారిటీ ఇచ్చాడు. ”ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీ జోడీలను మాత్రమే మా టీం ఎంపిక చేసింది. తాప్సీకి సెట్ అయ్యే జోడీ దొరికితే, అప్పుడు ఆమెను కూడా నేనే స్వయంగా వెళ్లి, షోకు రమ్మని ఆహ్వానిస్తాను. కానీ, అప్పుడు నా షోకు తాప్పీ రాకపోతే మాత్రం నేను చాలా బాధపడతాను” అని కరణ్ జొహార్ అన్నాడు. మరి తాప్సీ వచ్చే సీజన్‌లోనైనా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్తుందా? కరణ్ జొహార్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతుందా? ఒకవేళ షోకి వస్తే, తాప్సీ ఎవరితో కలిసి హాజరౌతుంది? అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.